![నీది నిజంగా పెద్ద కలేనా ? [Needi Nijamga Pedda Kalenaa?]](https://m.media-amazon.com/images/I/71EyyyvwPdS._SX1200_.jpg)
ABOUT BOOK : ఒక చిన్న పల్లెటూరిలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి తెలుగు మీడియంలో, గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక వ్యక్తి, అందరిలాగా బాగా చదువుకుని ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి అని కాకుండా ఇంకేదో పెద్దగా సాధించాలి అనే తపనతో చదువుతున్న సమయం నుండే చిన్న చిన్న ఐడియాలతో బిజినెస్ ప్రారంభించి, 25 సంవత్సరాల వయసుకే వరుసగా 8 సార్లు ఫెయిల్ అయ్యి, 9వ సారి విజయం సాధించాడు. ఇప్పుడు ఆ కంపెనీ విలువ 10 మిలియన్ డాలర్లు. ఇందులో అతని పెట్టుబడి కేవలం ఐడియా మరియు పెద్ద పెద్ద కలలు మాత్రమే. ఈ బుక్ లో ఒక తండ్రి, తన కొడుకు లో ఎలాంటి ప్రేరణ నింపాడు, ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్కూల్ లో గురువుల నుండి ఏమి నేర్చుకున్నాడు, పెద్దగా ఎలా ఆలోచించగలిగాడు, తనకు తాను పెద్ద గోల్స్ ఎలా పెట్టుకున్నాడు, సినిమాలు అతన్ని ఎలా ప్రభావితం చేశాయి, ఫెయిల్యూర్స్ ని ఎలా తట్టుకున్నాడు, డబ్బులు ఎలా సంపాదించి, పోగొట్టుకున్నాడు, ముఖ్యంగా ఏదైనా పెద్దగా సాధించాలి అంటే కావలసిన శక్తి ఏమిటి. వంటి ఎన్నో విషయాలను తెలియజేశారు. ABOUT AUTHOR : డి. సి. తిరుపతి దద్దాల పేరు పొందిన రచయిత కాదు. ఒక సాధారణ మనిషి. ఎవరైనా వారికి వారు గోల్స్ పెట్టుకుంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతో ఆనందంగా ఆ గోల్స్ సాధించడం కోసం ఇష్టంగా కష్టపడితే చివరకు ఏదో ఒక రోజు ఆ గోల్స్ ని చేరుకోగలము అనే విషయాన్ని తెలియ జేయుటకు తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలనూ పుస్తక రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకం ద్వారా ప్రతి ఒక్కరూ పెద్దగా ఆలోచించడం నేర్చుకొని పెద్ద పెద్ద కలలు కని, వాటిని సాధించడం కోసం కావాలసిన శక్తి ఏమిటో తెలుసుకుంటారనేది రచయిత అభిప్రాయం. ఈ పుస్తకం ద్వారా ఎంతో మంది ఇన్స్పిరేషన్ పొందుతారని ఆశిస్తున్నారు.
| Brand Name | Gurucool publishing |
| Manufacturer | Gurucool publishing |
| Item Type | Self-Help · Books |
| Shipping Weight | 430 g |
| Package Dimensions | 20.3 × 12.7 × 2.5 cm |
| Category | Books › Health, Family & Personal Development › Self-Help |
| Category Rank | #508,488 in Books |
| Marketplace Rating | 4.8 out of 5 (37 ratings on the source marketplace) |
| EAN | 9789390251551 |



