
నేనో మాటన్నాను. కాదు, నేనో నిజం చెప్పాను. దాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజం చెప్పాలంటే, అసలు అర్థం చేసుకోలేదు. ఆ మాట మీడియా దగ్గర నుంచి సాదాసీదా మనుషుల మధ్యలో చర్చగా మారింది. అర్థం చేసుకోని వాళ్ళని నేను నిందించను. జాలి పడతాను. ఎందుకంటే, ఒక సంభాషణలో కేవలం రెండు ముక్కల్ని తీసుకుని తప్పులు వెతికితే, అందరి మాటలూ బూతుల్లానే వినిపిస్తాయి. అయినా ఇప్పటికీ నేను మాట్లాడింది నిజమేనని చెప్తాను. సొంతిల్లు ఉండదు ఆడపిల్లలకు. ఇంట్లో గొడవైతే అమ్మ, కూతురు, చెల్లి, అక్క, పిన్ని, వదిన… ఒక్కటేంటి, మొత్తం ఆడజాతి ఎక్కడికి పోతుంది? అందుకే సొంతిల్లు కట్టుకోమన్నాను. నాకు లేదని ఎగతాళి చేశారు. నేనూ అదే కదా చెప్తున్నాను, నాకు లేదు కాబట్టే ఉండాలన్నాను. ఆడవాళ్ళందరికీ ఉండాలన్నాను. డబ్బున్నవాళ్లు కట్టి చూపిస్తారు. నేను రచయిత్రిని. మాకు రచనల్లో మిగిలేది భవనాలు కావు బరువుగల భావోద్వేగాలు మాత్రమే. నేను కట్టి చూపించలేకపోవచ్చు. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు. కానీ నా దగ్గర కళ ఉంది. నేను రాయగలను. ఈ గొడవల నుంచి బయట పడదామని నేనీమధ్య ఒక ఊరికి వెళ్లాను. అక్కడ వంద మంది ఆడవాళ్ళని అడిగితే, తొంభై ఐదు మంది “సొంతిల్లు లేదు” అన్నారు. వాళ్లందరూ అక్కడ పనికోసమో విహరించడం కోసమో వచ్చినవాళ్లే. రిచ్, పూర్, మిడిల్ క్లాస్, అందరూ ఆ వంద మందిలో ఉన్నారు. అప్పుడే అర్థమైంది, ఈ ట్రోల్స్ అన్నిటికీ ఒక్క సమాధానం సరిపోదు. కనీసం పుస్తకం ద్వారా అయినా చెప్తే అర్థమవుతుందని ఈ కథలు రాశాను. ఈ పుస్తకం అచ్చుకి తెచ్చాను. No sorries for the strong language in this book.
| Brand Name | KADALI Writes & Publications |
| Manufacturer | Kadali Writes and Publications |
| Item Type | Short Stories · Books |
| Shipping Weight | 110 g |
| Package Dimensions | 20 × 13 × 1 cm |
| Category | Books › Literature & Fiction › Short Stories |
| Category Rank | #17,155 in Books |
| Customer Reviews | 4.5 out of 5 (17 ratings) |



