
జ్ఞానేశ్వరీ భగవద్గీత మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, తత్వవేత్త, నాథ సంప్రదాయానికి చెందిన సన్యాసి జ్ఞానేశ్వరుడు. ఆయన రచించిన 'భగవద్గీత'నే మరాఠీ సాహిత్యంలో మైలురాళ్ళుగా పరిగణిస్తారు. వీరి భగవద్గీతకు, వ్యాసమహర్షి భగవద్గీతకు మూలం ఒకటే అయినా ఆదర్శంలో కొంత భేదం ఉంటుంది. ఈ గ్రంధం రచించిన జ్ఞానదేవుడు ఒకసారి సన్యాసం తీసుకుని మళ్ళా గృహస్తుడైన వ్యక్తీ కుమారుడు. అంటే తన జీవితంలో ధర్మానికి ఎంతో ఇబ్బంది పడి ఉంటాడన్నది సత్యం. అప్పటి రోజుల్లో, ప్రజల్లో మతమౌఢ్యం, సాంఘిక దురభిమానం, మూఢ నమ్మకాలు లాంటివి పెరిగి గ్రామ దేవతలకు మూగజీవాలను బలి ఇవ్వడం ఎక్కువైంది. జ్ఞానేశ్వరుడు తను రాసిన "జ్ఞానేశ్వరి భగవద్గీత" అనే గ్రంథంలో ఈ మూఢాచారాలను విమర్శించాడు. 21 సంవత్సరాల అతి తక్కువ జీవిత కాలంలోనే భగవద్గీత మీద ఆయన పలు రచనలు చేశారు. శంకరాచార్యుల వారి కాలం నుండీ, గొప్ప తత్త్వవేత్తలు తరచుగా భగవద్గీతపై తమ తమ వ్యాఖ్యానాలను రచించారు. సంస్కృతము నుండి దానిని ఎన్నో భారతీయ భాషలలోకి అనువదించటం కూడా జరిగింది. ఉదాహరణకి 13వ శతాబ్దంలో సంత్ జ్ఞానేశ్వర్ మరాఠీ లో రచించిన "జ్ఞానేశ్వరీ" అనే గ్రంధం. ఇలాంటి విలువైన మరాఠీ గ్రంధాన్ని తెలుగులోకి దిగవల్లి శేషగిరిరావు గారు అనువాదం చేయడం, దానిని నవరత్న బుక్ హౌస్ వారు ముచ్చటగా ముద్రించి మనకు అందించడం గొప్ప విషయం. నిజంగా ఈ 'జ్ఞానేశ్వరీ భగవద్గీత' మన ఇంట్లొ ఉండడం మన ఇంట కనకవర్షమే అంటే అవాక్కవకండి మరి!
| Brand Name | TRIVENI PUBLISHING HOUSE |
| Manufacturer | TRIVENI PUBLISHING HOUSE |
| Item Type | Hinduism · Books |
| Shipping Weight | 450 g |
| Package Dimensions | 21.3 × 14.3 × 3 cm |
| Category | Books › Religion & Spirituality › Hinduism |
| Category Rank | #178,919 in Books |
| Marketplace Rating | 4.7 out of 5 (7 ratings on the source marketplace) |